Nata Convention 2018
nata-title

Events

నాటా-నవ్య వీక్లీ సంయుక్త నిర్వహణలో 10 కథలు : 10 కవితల పోటి

2016-02-27

కథ: నిబంధనలు

  1. కథ తెలుగు వారి జీవితలనికి అద్దం పట్టేలా ఉండాలి
  2. ప్రపంచంలోని ఏ ప్రాంతమైనా కథకు నేపధ్యం కావచ్చు. అయితే అది తెలుగువారి జీవితానికి సంబంధించినదై ఉండాలి
  3. కధలు అరటావు సైజులో 10 పేజీలకు మించకుండా ఒక వైపునే రాసి పంపాలి. దస్తూరి చక్కగా అర్థమయ్యేలా ఉండాలి. డి.టి.పి. చేసిన పక్షంలో అది 6 పేజీలకు మించరాదు
  4. కథను పంపేటప్పుడు రచయిత/రచయిత్రి పేరు అందులో ఉండరాదు. పేరు, పూర్తి చిరునామా వేరే కాగితం మీద రాసి జత పరచాలి. అనుకరణ, అనుసరణ కాదని, బ్లాగులోనూ, వెబ్ మాగజైనులోనూ రాలేదని హామీ పత్రం విధిగా జత చేయాలి. కవరు మీద ‘నాటా-నవ్య వీక్లీ కథల పోటికి’ అని స్పష్టంగా పేర్కొనాలి.
  5. విదేశాల నుంచి కథలు పంపించే రచయితలు/రచయిత్రులు మాత్రమే ఈ-మెయిల్ navyaweekly@andhrajyothy.com సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు. స్వదేశీయులకు ఈ సౌకర్యం వర్తించదు.
  6. బహుమతి పొందిన కథలు ‘నవ్య’ వీక్లీలోనే గాక నాటా వారి సావనీర్లో కూడా ప్రచురితమవుతాయి.
  7. పోటీ గడువు తేదిని పోడిగించేదుకు కానీ, అర్హమైన రచనలు రాకపోతే బహుమతుల్లో మార్పులు చేసేందుకు కాని ‘నవ్య వీక్లీ’ యాజమాన్యానికి సర్వహక్కులూ ఉన్నాయి.
  8. కథల ఎంపిక విషయంలో తుది నిర్ణయం నవ్య సంపాదక వర్గానిదే! ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు కాని, వాద ప్రతివాదాలకు కాని తావు లేదు. ప్రచురణలు అనర్హమైన కథలను తిప్పి పంపడం సాద్యం కాదు

కవిత: నిబంధనలు

  1. కవిత తెలుగు వారి జీవితానికి అద్దం పట్టేలా ఉండాలి.
  2. ప్రపంచంలోని ఏ ప్రాంతమైనా కవితకు నేపథ్యం కావచ్చు అయతే అది తెలుగు వారి జీవితానికి సంబంధించినదై ఉండాలి.
  3. కవిత 30 పంక్తులకు మించకుండా ఒకవైపునే రాసి పంపాలి. దస్తూరి చక్కగా అర్థమయ్యేలా ఉండాలి.
  4. కవితను పంపేటప్పుడు కవి/కవియత్రి పేరు అందులో ఉండరాదు. పేరు, పూర్తి చిరునామా వేరే కాగితం మీద రాసి జత పరచాలి. అనుకరణ కాదని, బ్లాగుల్లోనూ, వెబ్ మాగజైన్ లోనూ రాలేదని హమీ ప్రతం విధిగా జత చేయాలి. కవరు మీద 'నాటా-నవ్య వీక్లీ కవితల పోటీకీ’ అని స్పష్టంగా పేర్కొనాలి.
  5. విదేశాల నుంచి కవితలు పంపించే కవులు/కవయత్రులు మాత్రమే ఈ-మెయల్ navyaweekly@andhrajyothy.com సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు. స్వదేశీయులకు ఈ సౌకర్యం వర్తించదు.
  6. బహుమతి పొందిన కవితలు 'నవ్య ' వీక్లిలోనే గాక నాటా వారి సావనీర్ లో కూడా ప్రచురితమవుతాయి.
  7. పోటీ గడువు తేదీని పొడిగించేందుకు కానీ,అర్హమైన కవితలు రాకపోతే బహుమతుల్లో మార్పులు చేసేందుకు కానీ ‘నవ్య వీక్లి’ యాజమాన్యానికి సర్వహక్కులూ ఉన్నాయి.
  8. కవితల ఎంపిక విషయంలో తుది నిర్ణయం నవ్య సంపాదక వర్గానిదే ! ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు కాని, వాద ప్రతివాదాలకు కాని తావు లేదు.ప్రచురణకు అనర్హమైన కవితలను తిప్పి పంపడం సాధ్యం కాదు.

నాటా-నవ్య వీక్లీ కథలు - కవితల పోటి

Facebook