నాటా కన్వెన్షన్ దిశగా వడివడ

news

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) మే నెలలో నిర్వహించబోయే కన్వెన్షన్‌ను పురస్కరించుకుని కిక్ ఆఫ్ మీటింగ్‌ను మార్చి 8న డల్లాస్‌లో నిర్వహించింది. కన్వెన్షన్ కన్వీనర్ రమణారెడ్డి మాట్లాడుతూ మే 27 నుంచి 29 వరకు నాటా డల్లాస్ కన్వెన్షన్ జరుగుతుందన్నారు. తనను కన్వీనర్‌గా ఎంపిక చేసినందుకు నాటా బోర్డుకు, అడ్వైజరీ కౌన్సిల్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కన్వెన్షన్ ఏర్పాట్లపై స్థానిక నాయకులు, సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. కన్వెన్షన్ దిశగా తనకు సహకరిస్తున్న అందరికీ ఆయన కృతజ్నతలు తెలిపారు. అందరూ కలిసి కన్వెన్షన్‌ను అద్భుతంగా నిర్వహించేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.<br> 
కోఆర్డినేటర్ రామసూర్య రెడ్డి మాట్లాడుతూ డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే వేడుకల కోసం ఓమిని హోటల్లో అతిథుల కోసం భారీగా గదులు బుక్ చేసినట్లు తెలిపారు. కన్వెన్షన్‌ను విజయవంతం చేసేందుకు 40 కమిటీలు ఏర్పాటు చేశామని.. 300 మంది వాలంటీర్లు ఆ దిశగా పని చేస్తున్నారని చెప్పారు. నాటా సీనియర్ లీడర్, అడ్వైజర్ డాక్టర్ ఎస్.రాఘవరెడ్డి మాట్లాడుతూ కమిటీలతో కలిసి తాను సమన్వయం చేసుకుంటూ సాగుతానన్నారు. నాటా నాయకత్వం గురించి జయచంద్రారెడ్డి వివరించారు. టాంటెక్స్ అధ్యక్షుడు నరసింహారెడ్డి ఊర్మిండి మాట్లాడుతూ నాటా కన్వెన్షన్‌కు తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఈ వేడుకలకు సహ ఆతిథ్యమిస్తుండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.<br>నాటా అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, డాక్టర్ రామిరెడ్డి బూచిపూడి, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జయచంద్రారెడ్డి, స్టాండింగ్ కమిటీ ఛైర్స్ ఫల్గుణ్ రెడ్డి ఉమామహేశ్వర కుర్రి, జయసింహారెడ్డి, ఆర్వీపీలు దర్గారెడ్డి, మహేందర్ కామిరెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్లు సతీశ్ శ్రీరాం, మురారి రెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాస ఓబుల్ రెడ్డి, రవీంద్రరెడ్డి, శ్రీనివాసరెడ్డి వీరభద్ర, నాగరాజ్ చల్లా, రమేష్ గాదిరాజు, సాయి వీరాపల్లి, రవి కోన, ఉమమహేష్ పామపల్లి, వెంకటరెడ్డిలతో పాటు నాటా నాయకులు డాక్టర్ తారాకుమార్ రెడ్డి, గుర్రం శ్రీనివాసరెడ్డి, విష్ణు బత్తుల, రావు కాల్వల, ప్రతాప్ భీమ్ రెడ్డి, రమణా రెడ్డి పుట్లూరి, మహేష్ గూడూరు, సుధాకర్ రెడ్డి, వెంకట్ తాండ్ర, రఘు గజ్జల, చంద్ర బుద్ద తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టాంటెక్స్ మాజీ ఈసీ సభ్యులు సుబ్రమణ్యం జొన్నలగడ్డ, శారద సింగిరెడ్డి కన్వెన్షన్ విషయంలో తమ సలహాలు అందజేశారు.

 

 Oct 31 2018