NATA Women's Day @Virginia

news

వర్జీనియా: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఆధ్వర్యంలో వర్జీనియాలో నిర్వహించిన  అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 500 మందిమహిళలతో కళకళలాడుతూ ఎంతో ఘనంగా జరిగాయి. నాటా బోర్డ్ అఫ్ డైరెక్టర్ సుధారాణి కొండపు సారధ్యం లో కల్చరల్ కమిటీ ఛైర్ విజయ దొండేటి, అనిత ఎరగంరెడ్డి, సంధ్య బైరెడ్డి, చిత్ర దాసరి, చైతన్య అమ్మిరెడ్డి, స్వరూప గిండి,లావణ్య దండు, గౌరి పొడిల మరియు ఇతర సభ్యుల సహకారం తో ఈ వేడుకలు విజయవంతం అయ్యాయి. నాటా ప్రెసిడెంట్ డాక్టర్ రాఘవరెడ్డి గోసల, నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మోహన్ కలాడి, కిరణ్ గున్నం, సతీష్ నరాల, బాబూరావు సామల, నాటా నాయకులు మధు మోటాటి, ఆంజనేయరెడ్డి దొండేటి, నినాద్ అన్నవరం, ఉదయ ఇంటూరు, వెంకట్ కొండపోలు, సుజిత్ మారం, రమేష్ వల్లూరి పాల్గొని తన సహాయసహకారాలు అందించారు. విజయ, సంధ్య మరియు చిత్ర ప్రత్యేక అతిథులను ఆహ్వానించగా అనేక మంది నాటా సభ్యులు ఈ కార్యక్రమం లో పాలుపంచుకున్నారు.

నాటా ప్రెసిడెంట్ డాక్టర్ రాఘవరెడ్డి గోసల గారు మాట్లాడుతూ నాటాలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంటుందనీ, ఇంటాబయటా అన్ని రంగాలలోనూ ముందంజ వేస్తున్న మహిళలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెనేటర్ జెన్నిఫర్ బయోస్కొ, కౌంటిఛైర్ ఫిలిస్ రేండల్, జాన్ బెల్ పాల్గొన్నారు.

ప్రియ గారి ప్రార్థనా గీతంతో మొదలైన ఈ కార్యక్రమం కూచిపూడి డాన్స్ అకాడమీనుంచి  ట్రినిటీ పంత్ ప్రదర్శించిన గణేష పంచరత్నం, మాధవీ మైలవరపుగారి బృందం ఆలపించిన అష్టలక్ష్మి స్తోత్రంతో పాటు మహిళాసంబంధమైన పాటలను సుధ , శ్రీలత, లలిత గారు ఆలపించగా శ్రావ్యమైన పాటలు వినడం ద్వారా మానసికోల్లాసము పెంపొందించుకోవడంపై లలితా రాంపల్లి వివరంగా తెలియజేసారు. ఇంద్రాణి దావలూరి ప్రదర్శించిన మహిషాసురమర్థని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

డి సి మెట్రో విభాగంలోని వివిధ రంగాలకు చెందిన స్ఫూర్తిదాయకమయిన మహిళలను గుర్తించి వారికి “నాటామహిళ “ పురస్కారాలను అందచేయటం జరిగింది. కూచిపూడి కళారంగంలో సేవలందిస్తున్న లక్ష్మిబాబు గారికి , ఆరోగ్యరంగం నుంచి శ్రీలేఖ పల్లె గారికి, మన తెలుగుమహిళల్లో అరుదుగా ఎంచుకునేరంగం నుంచి న్యాయవాది జనెత కంచర్లగారికి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోనే కాక అనేక రంగాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన పద్మిని నిడుమోలు గారిని ఈ సందర్భంగా గుర్తించడం జరిగింది .

చైతన్య తుల అడిగే  గొప్ప గొప్ప మహిళలకు సంబంధించిన ప్రశ్నలతో,  జయ తెలికుంట్ల మరియు రాధిక జయంతిల వ్యాఖ్యానంతో సరదా సరదా ఆటలతో మరియు విలువైన రేఫిల్స్ తో స్పాన్సర్ల గిఫ్ట్ లతో, వెండర్   స్టాల్ల్స్ తో , తత్వ వారి రుచికరమైన వంటకాలతో ఆహూతులను 3గంటల సేపు ఆకట్టుకున్నారు. మహిళా సాధికారత మరియు మహిళల గొప్పతనం గురించి వసుధారారెడ్డి గారు ఈ సమావేశం లో కొనియాడారు. తానా, ఆటా, ఆటా(తెలంగాణ), తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్, గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం, కాపిటల్ ఏరియా తెలుగు సంఘం నాయకులు పాల్గొని తమ అభినందనలు తెలియజేసారు.

మన తెలుగు ఆడపడుచులు వివిధ బ్యూటీ కాంటెస్ట్ లలో గెలుపొందిన ఇంద్రాణి, సురేఖ మరియు హిమాన్విలను ప్రత్యేకంగా అభినందించారు. చివరగా సంధ్య బైరెడ్డి అక్కడికక్కడే ఉత్సాహవంతులయిన 30 మంది మహిళలతో చేసిన ఫాషన్ వాక్ ప్రత్యేకత సంతరించుకుంది. ముగ్గురు మహిళామణులందించిన (డేజ్లింగ్ స్టార్స్) ఫోటో బూత్ డెకరేషన్ మరియు శ్రీలక్ష్మి మహిళా డి .జె .ఈ కార్యక్రమానికి ప్రత్యేకతలు.చివరగా బోర్డ్ ఆఫ్ డైరక్టర్ శ్రీమతి సుధారాణి నాటాఅధ్యక్షులు డాక్టర్ రాఘవరెడ్డి గారికి మరియు ఇతర నాటా కార్యవర్గ సభ్యులకు, మీడియా మిత్రులకు, స్పాన్సర్లకు, విచ్చేసిన అతిథులకు, ఆహూతులకు, ఇతర సోదర సంస్థల ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

 Mar 22 2019